Homeసినిమాపూజా హెగ్డే అవుట్.. నాని కోసం స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్!

పూజా హెగ్డే అవుట్.. నాని కోసం స్పెషల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ గురించి మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం మొదట పూజా హెగ్డేను సంప్రదించినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఈ అవకాశాన్ని వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రత్యేక గీతంలో కీర్తీ సురేష్ కనిపించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా తల్లి–కొడుకుల అనుబంధం, గిరిజనుల హక్కుల కోసం జరిగిన పోరాటం నేపథ్యంలో రూపొందుతోంది. భారీ ఎమోషన్స్‌తో పాటు కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.మొదట ఈ పాట కోసం పూజా హెగ్డేతో చర్చలు జరిగినట్లు సమాచారం. రెమ్యూనరేషన్, కంటెంట్‌పై కూడా చర్చలు సాగినప్పటికీ, ఆమె ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో షూటింగ్‌కు అందుబాటులో లేకపోయారని టాక్. ఇప్పటికే సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడటంతో, సెప్టెంబర్‌లోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీర్తీ సురేష్‌ను సంప్రదించగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో నానితో కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కీర్తీ సురేష్, ఆయనతో ఉన్న అనుబంధం కారణంగానే ఈ స్పెషల్ సాంగ్‌కు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మంచి స్పందన అందుకుంటున్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో నిజంగానే కీర్తీ సురేష్ కనిపిస్తారా? లేక మరో ట్విస్ట్ ఉంటుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై కారుకు మంటలు!- తప్పిన భారీ ప్రమాదం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు