దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహా ప్రాజెక్ట్ ‘రామాయణ’ సినిమా ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. మొదట ఈ ట్రైలర్‌ను అంతర్జాతీయ స్థాయి వేదిక అయిన శాన్ డియాగో కామిక్ కాన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అనూహ్య కారణాలతో ఈ లాంచ్‌ను వాయిదా వేసినట్లు సినీ వర్గాల్లో సమాచారం వెలువడుతోంది.
ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, టాలెంటెడ్ నటి సాయి పల్లవి, కన్నడ స్టార్ యశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది.
ఇక ట్రైలర్ వాయిదాకు ప్రధాన కారణంగా హాలీవుడ్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఈ చిత్రానికి వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో, ఒక హాలీవుడ్ సినిమాతో పాటు ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. దీని ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలనే వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మైథాలజికల్ సినిమా 2026 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ వాయిదా పడినప్పటికీ, సినిమా పై ఆసక్తి మాత్రం తగ్గకుండా మరింత పెరిగింది.
మొత్తానికి, ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్ ఆలస్యం అభిమానులకు కొంత నిరాశ కలిగించినా, గ్లోబల్ స్థాయిలో మరింత గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనే ప్లాన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
also read: చిరంజీవి మాటలు నా కెరీర్‌ను మార్చేశాయి.. జనరేషన్ గ్యాప్‌పై రాజా రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
