Homeజాతీయంటైఫాయిడ్‌తో బాధపడుతున్న అభిజిత్ దీప్కే – యువత ఉద్యమానికి మద్దతు, త్వరలోనే తిరిగి చేరతానని హామీ

టైఫాయిడ్‌తో బాధపడుతున్న అభిజిత్ దీప్కే – యువత ఉద్యమానికి మద్దతు, త్వరలోనే తిరిగి చేరతానని హామీ

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ప్రస్తుతం తాను టైఫాయిడ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.

ఇదే సమయంలో, శాంతియుతంగా కొనసాగుతున్న యువత ఉద్యమంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోరాటాన్ని అదే ఉత్సాహంతో కొనసాగిస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు.

ముఖ్యంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని యువతను కోరారు.

తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే తిరిగి ఉద్యమంలో పాల్గొంటానని అభిజిత్ దీప్కే హామీ ఇచ్చారు. ఈ విషయాలను ఆయన వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

also read: “మంచి కథలకు ఆ ఇండస్ట్రీ ఉత్తమ వేదిక”- తమిళ సినీ రంగంపై నిధి అగర్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజావార్తలు