ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ ప్రాంతంలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. సత్నా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థిని పై ముగ్గురు వ్యక్తులు అమానుషంగా దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం సమయంలో బాధితురాలు తన స్నేహితుడితో కలిసి దేవాంగన లోయ సమీపంలోని ఒక గుట్టపైకి వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము అటవీ శాఖ అధికారులు అంటూ నటించారు.
తరువాత ఆ యువకుడిపై దాడి చేసి, అతడిని కట్టేసి అడ్డంగా నిలిపి, యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
also read: రాజాసింగ్ కు దారేదీ…? మళ్లీ సొంతగూటికే చేరుతున్నారా…?
