Homeతెలంగాణబీజేపీ బెంగాల్ వ్యూహం...!

బీజేపీ బెంగాల్ వ్యూహం…!

  • తెలంగాణలో గెలుపు కోసం అస్త్రాలు

  • రంగంలోకి ఏబీఎం, జార్విస్ స్ట్రాటజీ టీంలు

  • 26న కరీంనగర్ కు అమిత్ షా

  • శ్రావణమాసంలో పార్టీలో భారీగా చేరికలు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పై బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని గట్టి ఆదేశాలు ఇస్తున్నారు. వై నాట్ తెలంగాణ అన్న సరికొత్త నినాదంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. బెంగాల్ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. రెండు పొలిటికల్ కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఏబీఎం , జార్విస్ స్ట్రాటజీ టీంలు రంగంలోకి దిగాయి. సంబంధిత సర్వే బృందాలు పార్టీ బలం, బలహీనతలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇకనుంచి బిజెపిలో భారీ స్థాయిలో చేరికలను ప్రోత్సహించాలని కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు…

Also Read:మిడ్‌డే మీల్‌లో తేలు కలకలం.. 100కి పైగా విద్యార్థులు అస్వస్థత, బీహార్‌లో ఆందోళన

బిజెపికి జాతీయాధ్యక్షుడుగా నితిన్ నబీన్ ఉన్నారు. కానీ పార్టీ విధానపరమైన నిర్ణయాలన్నింటిని అమిత్ షా చూస్తుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణ పై అమిత్ షా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈనెల 26న తెలంగాణకు రానున్నారు. కరీంనగర్ లో జరిగే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. పనిలో పనిగా తెలంగాణ బిజెపి ముఖ్య నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారని సమాచారం. పనిలో పనిగా భారత రాష్ట్ర సమితితో పొత్తుపై కూడా ఓకింత క్లారిటీ ఇవ్వనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం…

Also Read:పదవిలో హోదా.. పనిలో సాదాసీదా.. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ హరిత

తెలంగాణను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 చోట్ల విజయం సాధించింది. అయినా సరే అదే దూకుడుతో ముందుకు వెళ్లడంతో అక్కడకు ఎనిమిది నెలల వ్యవధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలను సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడింది. అయితే గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ, నగర ప్రాంతాల్లో ఆ పార్టీకి పట్టు ఎక్కువ. అందుకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పట్టున్న బలమైన నేతలను బిజెపిలోకి రప్పించేందుకు వ్యూహరచన చేస్తోంది.

అన్ని జిల్లాల్లో సర్వే…

Also Read:ప్రకాశ్ రాజ్‌కు రెవెన్యూ నోటీసులు.. వాగమన్ భూములపై సర్వేకు అధికారులు సిద్ధం

తెలంగాణలో ఏబీఎంతో పాటు జార్విస్ స్ట్రాటజీ సంస్థలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థలు బిజెపి కోసం పనిచేస్తుంటాయి. ఈ సంస్థల ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. వివిధ జిల్లాల్లో సర్వేలు చేస్తున్నాయి. బిజెపి బలం, బలహీనతలు, సామాజిక సమీకరణలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల ప్రభావం వంటి అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో ఈ సర్వే కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున తెలంగాణలో పార్టీ చేరికలపై బిఎల్ సంతోష్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నేతల మధ్య సమన్వయానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్, బండి సంజయ్ ల మధ్య రాజి ఫార్ములా రూపొందించారు.

పెద్ద ఎత్తున ఆకర్ష్…

Also Read:ఒకే వరుడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పెళ్లి… అమ్రోహాలో వైరల్ అయిన విభిన్న వివాహ వేడుక

తెలంగాణలో బిజెపి ఆకర్ష్ లో భాగంగా పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రావణమాసం సందర్భంగా ఇతర పార్టీల నాయకుల చేరిక పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 26న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరీంనగర్ వస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలపై కీలక టాస్క్ ఇస్తారు. మొత్తానికైతే బీజేపీ తెలంగాణపై గట్టిగానే గురి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు