Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం...! హైద‌రాబాద్ వాసుల మృతి...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం…! హైద‌రాబాద్ వాసుల మృతి…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. షేక్ అబ్దుల్ నవీద్, నజేయా సల్మా దంపతులు, వారి ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నజేయా సల్మా (45), కుమార్తె నిహాయీన్ షేక్ (19), కుమారుడు ఉమర్ షేక్ (14) అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read:గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం – బాణాసంచా యూనిట్‌లో పేలుడు, 10 మంది మృతి

షేక్ అబ్దుల్, ఐదేళ్ల కుమార్తె ఖదీజా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలోని సైదాబాద్ లోని వాణి నగర్ కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్ అమెరికాలో ప్రముఖ ఫార్మా కంపేనీ మెర్క్ లో డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Also Read:ర్ణాటకలో విషాదం: భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య

తాజావార్తలు