Homeవైరల్హైవేపై విమానం.. ట్రాలీపై వెళ్తున్న దృశ్యం వైరల్

హైవేపై విమానం.. ట్రాలీపై వెళ్తున్న దృశ్యం వైరల్

AP: జగ్గంపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆకాశంలో కనిపించే విమానం.. ఈసారి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ భారీ ట్రాలీపై విమానాన్ని తరలించారు. హైవేపై భారీ వాహనంపై విమానం ప్రయాణిస్తుండటాన్ని చూసిన పలువురు ఆసక్తిగా గమనించారు. కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.

విమానాన్ని తరలిస్తున్న ఈ ప్రత్యేక రవాణా జగ్గంపేట ప్రాంతంలో కొద్దిసేపు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకాశంలో ఎగరాల్సిన విమానం రోడ్డుపై కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే విమానాన్ని రహదారి మార్గంలో తరలించడం సాధారణ ప్రక్రియలో భాగమేనని, భారీ పరిమాణంలో ఉన్న వస్తువులను ప్రత్యేక అనుమతులతో ట్రాలీలపై తరలిస్తారని అధికారులు చెబుతున్నారు.

also read: నల్లగొండలో విషాదం.. మెడికల్ విద్యార్థిని మృతి, అనుమానిత యువకుడి ఆత్మహత్యతో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు