Homeఆంధ్ర ప్రదేశ్అనిల్ కుమార్ యాదవ్ కు డౌటే!

అనిల్ కుమార్ యాదవ్ కు డౌటే!

•జగన్ ఆదేశాలతో యాక్టివ్
•వచ్చే ఎన్నికల్లో టికెట్ పై దక్కని హామీ
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. అయితే ఆయన మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఓటమి ఎదురయ్యేసరికి సైలెంట్ అయ్యారు. గత రెండు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల విషయంలో అంటి ముట్టనట్టుగా ఉన్నారు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు అనిల్ కుమార్ యాదవ్. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా దూకుడుగా వ్యవహరించడంతో జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరయ్యారు. అందుకే 2019లో రెండోసారి గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అయితే రెండున్నర ఏళ్లకే మంత్రి పదవిని కోల్పోయారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విధేయత కనబరుస్తూ ముందుకు వెళ్లారు. కానీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ కు సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువయ్యారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయనను నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. కానీ ఓటమి తప్పలేదు.

టికెట్ పై దక్కని హామీ..
అయితే నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ కు స్పష్టమైన హామీ లభించలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి. అక్కడ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్. ఇది ఎంత మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు రుచించలేదు. అందుకే తనకు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగిస్తేనే యాక్టివ్ అవుతానని తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ముందు పార్టీ కోసం పనిచేయాలి. తరువాత చూద్దాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంతో.. అనిల్ ఆలోచనలో పడ్డారు. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ యాక్టివయ్యారు. కానీ పూర్తిస్థాయిలో ఆయనకు టికెట్ హామీ లేదని తెలుస్తోంది. దీంతో నెల్లూరులో పరిస్థితి ఎలా ఉండబోతుందో నన్న చర్చ అయితే జరుగుతోంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు