తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువ నర్సు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
తిరువేలాంగాడు ప్రాంతానికి చెందిన జయలక్ష్మి (23) అనే యువతి ఓ యువకుడిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువకుడు, ఆ తర్వాత మాట మార్చి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడనే ఆవేదనతో జయలక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జయలక్ష్మి మృతికి గల పూర్తి కారణాలు, యువకుడి పాత్రపై విచారణ కొనసాగుతోంది.
also read: విశాఖ సముద్రంలో బోటు ప్రమాదం.. ఇద్దరు మత్స్యకారులకు తీవ్ర గాయాలు