Friday, February 27, 2026
Homeతెలంగాణరేవంత్ హెలికాప్టర్ దగ్గర కుక్క.. భద్రతా సిబ్బంది పరుగులు

రేవంత్ హెలికాప్టర్ దగ్గర కుక్క.. భద్రతా సిబ్బంది పరుగులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో ఊహించని ఘటన జరిగింది. భద్రతా సిబ్బందితో పాటు కాంగ్రెస్ నేతలను పరుగులు పెట్టించింది. సీఎం సెక్యూరిటీలో భద్రతా వైఫల్యం బయటపడింది. ముఖ్యమంత్రి భద్రత సిబ్బందికి ముచ్చెముటలు పట్టించింది.

యములాడ హెలికాప్టర్ పరిసరాల్లో కుక్క సంచారం కలకలం రేగింది. వేములవాడ బహిరంగ సభ ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు మరికొందరు హెలికాప్టర్ లో కూర్చున్నారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే మూడు నిమిషాలు ముందు ఒక కుక్క హెలికాప్టర్ సమీపంలోకి వచ్చి తచ్చాడింది. దీంతో అక్కడ ఉన్న వారందరూ కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు
ఆతర్వాత కుక్క ముందుకు వెళ్ళిపోయింది. హెలిపాడ్ వద్దకు కుక్క రావడం అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments