Homeఆంధ్ర ప్రదేశ్ఓటరు జాబితాలో పేరు లేకపోతే చనిపోయినట్లే: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!

ఓటరు జాబితాలో పేరు లేకపోతే చనిపోయినట్లే: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్,విశాఖపట్నం:- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓటరు జాబితాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఓటరు జాబితాలో పేరు లేని వ్యక్తులను తాను బతికిలేనట్లుగానే పరిగణిస్తానని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.విశాఖపట్నంలో జరిగిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఓటరు లిస్టులో పేరు లేని వారు నా దృష్టిలో చనిపోయినట్టే” అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.అలాంటి వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. “ఓటరు లిస్టులో పేర్లు ఉన్నాయో, లేదో చెక్ చేసుకునే బాధ్యత ప్రజలకు లేదా?” అని ఆయన నిలదీశారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన, బాధ్యత ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయి.

స్టార్ హీరోతో నటించాలని కల.. ఛాన్స్ వస్తే వెంటనే ఓకే అంటున్న నాగదుర్గ

Honey Trap Scam: న్యూడ్ వీడియో కాల్.. తర్వాత బ్లాక్‌మెయిల్.. యువ ఇంజనీర్‌కు భారీ షాక్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు