Homeఆంధ్ర ప్రదేశ్జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం....!ఒక‌రు మృతి

జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం….!ఒక‌రు మృతి

మచిలీపట్నం, క్రైమ్‌మిర్ర‌ర్‌: మచిలీపట్నం–కత్తిపూడి 216 జాతీయ రహదారిపై పెడన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగాయలంక సమీపంలోని దీనదయాళపురం గ్రామానికి చెందిన సంతోష్రావు (47) మృతి చెందారు. సంతోష్రావు పెడనలో రైల్వే ట్రాక్పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని మంగళవారం ఉదయం తోటమూలలోని తన ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 5 గంటల సమయంలో పెడన సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సంతోష్రావు అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read:అమెరికాలో రూ. 85వేలు.. ఇండియాలో కేవ‌లం రూ. 35…! అమెరికా మహిళ షాకింగ్ కామెంట్స్‌…

ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం 100 అడుగులకు పైగా ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. నాగేంద్రప్రసాద్, పెడన ఎస్సై జి. సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు సంతోష్రావుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Also Read:హైద‌రాబాద్‌లో కోటి దాటేసిన జ‌నాభ‌…!

తాజావార్తలు