ఏలూరు,క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ బచలకురి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను జూలై 1, 2026 న హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి పలు కేసుల్లో అరెస్టవుతూనే ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను కొందరు ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు.. ప్రజాస్వామ్యానికి విఘాతం అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రశ్న అనే పేరు పెట్టుకున్న మేధావి ఏం ప్రశ్నించారో ఎవరైనా చెప్పగలరా?అసలు ఈ జోసఫ్ రావణ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్‌లో ఏపీ ప్రభుత్వ విధానాలపై ఏమైనా ప్రశ్నించాడా? పవన్ కల్యాణ్ పరిధిలోని పంచాయతీ రాజ్ లేదా అటవీ శాఖల్లోని లోపాలపై సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీశాడా? లేక ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియాల్సిన అంశాలపై చర్చలు జరిపాడా? అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.
Also Read:హైదరాబాద్:బిర్యానీ.. ఓ ఎమోషన్!
ఈ ‘ప్రశ్న రావణ్’ ఛానల్ మొత్తం వెతికినా ఎక్కడా ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క విమర్శనాత్మక ప్రశ్న కూడా కనిపించదు. అన్నీ అయితే దైవదూషణలు..లేకపోతే పవన్ కల్యాణ్‌పై నిందలు. చివరికి టెర్రరిస్టుల్ని కూడా సమర్థించే బాపతు.జూన్ 28న ఏలూరులో జరిగిన ఒక సభలో ఈయన చేసిన వ్యాఖ్యలే ఈ వరుస అరెస్టులకు కారణమయ్యాయి. అక్కడ ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య పరిధిని దాటిపోయాయి. ఆయన మాట్లాడిన భాష, వాడిన పదజాలం ఏమాత్రం నాగరిక సమాజం ఆమోదించేలా లేవని సగటు నెటిజన్లు స్క్రీన్‌షాట్లతో సహా ఎండగడుతున్నారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం, వ్యూస్ కోసం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్యకరంగా థంబ్‌నైల్స్ పెట్టడం, లైవ్‌లలో బూతులు తిట్టడమే ఈయన నిత్యకృత్యంగా మారిందని రికార్డులు చెబుతున్నాయి.
Also Read:మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహా సంగ్రామం!
జోసఫ్ రావణ్ కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు.. సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తూ అత్యంత దారుణమైన రీతిలో దైవదూషణలకు పాల్పడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మతాల మధ్య చిచ్చు పెట్టేలా, ఒక వర్గాన్ని కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. సలు ఎలాంటి నైతికత లేని ఇటువంటి సోషల్ మీడియా అబ్యూజర్‌ను సమర్థిస్తూ.. కొందరు దీనిని ప్రజల గొంతుకను నొక్కేయడం అని అభివర్ణించడం ఘోరమైన విషయం. ప్రశ్న అనే పవిత్రమైన పదానికి ముసుగు వేసి.. మత దూషణలు, బూతుల పురాణం అందుకునే వాళ్లను అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడదు.. పైగా మరింత స్వచ్ఛంగా మారుతుంది.