Homeతెలంగాణకవితకు ఉంది ప్రత్యామ్నాయం!

కవితకు ఉంది ప్రత్యామ్నాయం!

•సిద్ధంగా తెలంగాణ జాగృతి.. లేకుంటే ప్రజా జాగృతి
•ఈసీతో యుద్ధం సమయం వృథా
•తేల్చి చెబుతున్న విశ్లేషకులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
కవిత పార్టీకి టిఆర్ఎస్ దక్కదని తేలిపోయింది. సాంకేతికంగా ఆ పేరు ఇవ్వలేమని ఎలక్షన్ కమిషన్ తేల్చేసింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు దీనిపైనే చర్చ నడుస్తోంది. పాత సెంటిమెంటును, గులాబీ పార్టీ క్యాడర్ను ఆకట్టుకోవడానికి వీలుగా టిఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా.. కవిత ఆ పేరును ఎంచుకున్నారు. దీనిపై దాదాపు 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో అత్యధిక భాగం తన తండ్రికి చెందిన భారత్ రాష్ట్ర సమితి నుంచి. అందుకే 15 రోజుల్లో గా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని.. లేకుంటే దరఖాస్తుల క్లోజ్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ కవితకు అల్టిమేట్ జారీ చేసింది. అయితే తాను న్యాయపోరాటం చేస్తానని.. ఎట్టి పరిస్థితుల్లో పేరు మార్చుకోబోనని కవిత చెబుతున్నారు.

కోర్టుల జోక్యం ఉండదు..
ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగ వ్యవస్థ జోలికి న్యాయస్థానం పోదు. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తిరస్కరిస్తే.. అటు తరువాత కోర్టు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఫలానా పేరును సదర వ్యక్తికే కేటాయించాలి అని అత్యున్నత న్యాయస్థానం ఈసికి ఆదేశించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఒకవేళ కవిత పంతానికి పోయి కోర్టు మెట్లు ఎక్కితే అది కేవలం కాలయాపనకు మాత్రమే దారితీస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతోంది. ఉన్నది తక్కువ సమయమే. ఇలాంటి కీలక తరుణంలో కేవలం పేరు వివాదాల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే కాలం కరిగిపోతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం మాత్రం సాధ్యం కాదు.

ప్రత్యేక వేదిక..
కవితకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ జాగృతి పేరు ఉంది. ఆ పేరుతోనే ఆమె సుపరిచితురాలు అయ్యారు తెలంగాణ సమాజంలో. కెసిఆర్ కుమార్తెగా తెరపైకి రావచ్చు కానీ.. ఆమెకు ఇంతటి గుర్తింపు మాత్రం తెలంగాణ జాగృతి మూలంగానే. వాస్తవానికి బంజారాహిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడే.. చాలామంది అదే పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని భావించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా, బతుకమ్మ పండుగ ద్వారా కవిత మహిళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి బ్రాండ్ ను విపరీతంగా ప్రమోట్ చేసారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సమస్త కు ప్రతి గ్రామంలోనూ బలమైన నెట్వర్క్ కమిటీలు ఉన్నాయి. ఒక కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పడే శ్రమ కంటే.. ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి అనే పేర్లతో పార్టీగా మారిస్తే క్యాడర్ అనుసంధానం అవుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రజానీకం పై విపరీతమైన ప్రభావం చూపింది. ఆ విషయం కవితకు సైతం తెలుసు. అందుకే ఆమె టిఆర్ఎస్ అనే మూడు అక్షరాల కోసం ఈసీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు. కానీ అది వృధా ప్రయాస. వాస్తవానికి ప్రజా సమస్యలతో మమేకమై పనిచేస్తున్నారు కవిత. స్వల్ప కాలంలోనే ఆమె గుర్తింపు సాధించారు. పైగా కెసిఆర్ కుమార్తె అనే బ్రాండ్ ఇమేజ్ ఆమె సొంతం. ఇటువంటి తరుణంలో సమయాన్ని వృధా చేయకుండా.. తెలంగాణ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోరాటం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి కవిత ఆలోచన ఎలా ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు