హైదరాబాద్, క్రైమ్మిర్రర్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థులకు మాత్రమే ఈ టిఫిన్స్, లంచ్ ఉచితంగా అందిస్తుండగా.. ఇక నుంచి టీచర్లు, లెక్చరర్లకు కూడా అందించనున్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయానికి తాజాగా మంత్రివర్గం కూడా ఆమోద ముద్ర వేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు.. ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గత ప్రభుత్వాలు.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా తీసుకువచ్చింది.
Also Read:Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!
అంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ పథకాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలతోపాటు కాలేజీల్లో చదివే విద్యార్థులకు రెండు పూటలా పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయానికి తెరతీసింది.ఇక నుంచి విద్యార్థులకు మాత్రమే కాకుండా స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకంతోపాటు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న తెలంగాణ తొలి ఈ-కేబినెట్ భేటీలో విద్యా రంగానికి సంబంధించి ఈ చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
Also Read:భారత్–పాక్ సంబంధాల్లో కొత్త ఆశలు… 117 మంది ప్రముఖుల సంయుక్త లేఖ
ఈ నిర్ణయంతో ఇప్పటినుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు.. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అందరికీ ఫ్రీగా ఉదయం అల్పాహారం.. మధ్యాహ్న భోజనం అందించనున్నారు.ఇప్పటివరకు గవర్నమెంట్ స్కూళ్లలో కేవలం విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం.. కొన్నిచోట్ల సీఎం అల్పాహార పథకం అమలు అవుతుండగా.. దాన్ని ఉపాధ్యాయులకు కూడా విస్తరించనున్నారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు మరికొంత ఎక్కువ సమయం గడపడానికి.. విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేందుకు వీలు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ వీసా మోసం… ఒమన్ ప్రయాణానికి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు!