Homeజాతీయంత‌మిళ‌నాడులో సంచ‌ల‌నం...! టీవీకే ఎమ్మెల్యేల‌కు 35 కోట్ల ఆఫ‌ర్‌...

త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం…! టీవీకే ఎమ్మెల్యేల‌కు 35 కోట్ల ఆఫ‌ర్‌…

చెన్నై, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వివిధ పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, సర్కారు ఏర్పడిన రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందనే వార్త సంచలనంగా మారింది. టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారనేది ప్రధాన ఆరోపణ. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దళపతి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సర్కారును కూల్చేందుకు చేసిన కుట్రను తమిళనాడు నిఘా, పోలీస్ యంత్రాంగం భగ్నం చేసింది. టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి, వారిని ప్రలోభపెట్టిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఉన్నతాధికారితో పాటు ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:పోలవరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం హబ్: 10 వేల ఎకరాల్లో భారీ ప్రణాళికలు 

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి కుట్ర జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టి ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో ఒకర్ని అరెస్టు చేయగా, మిగతా ఇద్దరిని కరూర్‌‌లో అదుపులోకి తీసుకున్నారు. కుట్ర, దాని విస్తృత నెట్‌వర్క్‌పై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఎలయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు రూ.35 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

Also Read:హిందూ వివాహంపై గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

తర్వాత తనను బెదిరించారని, దీనిపై ఎవరితోనూ చర్చించవద్దని చెప్పారని ఎమ్మెల్యే ఆరోపించారు. అరెస్టైన ముగ్గురిలో ఒకరు సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడు అశోక్‌‌కు సన్నిహితుడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఈ పరిణామానికి ముందు డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే టీవీకే ప్రభుత్వం కూలిపోతుందని, తమిళనాడులో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీఎంకే వ్యూహాత్మకంగానే విజయ్ ప్రభుత్వంపై కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై అధికార టీవీకే, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్‌కుమార్‌ డీఎంకేపై విరుచుకుపడ్డారు. ‘‘సెంథిల్ బాలాజీతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే ‘కరూర్ గ్యాంగ్’‌కు ఇందులో ప్రత్యక్ష పాత్ర ఉంది… పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలి. ఇలాంటి నీచ కార్యకలాపాలకు ముగింపు పలకాలి’’అని కుమార్ అన్నారు.

Also Read:New Public Safety Bill: విచారణ లేకుండానే ఏడాది జైలు.. బెంగాల్ ప్రభుత్వం సంచలన చట్టం!

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామితో డీఎంకే కుమ్మక్కయ్యిందని మంత్రి ఆరోపించారు. పలువురు టీవీకే ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల కోసం డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. ‘‘ఈపీఎస్ తదితరులు దొంగదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు… ఈరోజు దాని స్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ వంటి డీఎంకే కీలక వ్యక్తులు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. వారికి రూ.10 కోట్లు, 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు’’ అని మంత్రి కుమార్ మండిపడ్డారు.అయితే, ఈ ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. టీవీకే కట్టుకథలు అల్లుతోందని ఎదురుదాడి చేసింది. దర్యాప్తు వివరాలను టీవీకే లీక్ చేసిందని డీఎంకే ఆరోపించింది. ‘‘కేవలం దర్యాప్తు వివరాలను లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని భావిస్తుంది. వారి ఆరోపణలు నిజం కాదని, కేవలం కల్పిత కథనాన్ని మాత్రమే సృష్టించడమే వారి ఉద్దేశమని ఇది స్పష్టం చేస్తోంది’’ అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నారు. ఒకవేళ, ఆధారాలుంటే సెంథిల్ బాలాజీని టీవీకే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు