Homeక్రైమ్పోలీసుల ప్ర‌త్యేక ఆప‌రేష‌న్... మోస్ట్ వాంటెడ్ దొంగ అరెస్ట్...!

పోలీసుల ప్ర‌త్యేక ఆప‌రేష‌న్… మోస్ట్ వాంటెడ్ దొంగ అరెస్ట్…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా సీసీఎస్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పలు చోరీ కేసుల్లో నిందితుడైన భూషణ్ శ్రీకాంత్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా భూషణ్ శ్రీకాంత్‌పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 10కు పైగా ఇల్లు చోరీ కేసులు నమోదయ్యాయి. అతడు చాలాకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆదిబట్ల సమీపంలో మాటువేశారు.

Also Read:వార‌ణాసిలో మాంసం బంద్‌…!ఇక శాఖాహార‌మే…?

నిందితుడిని పట్టుకునే సమయంలో అతడు పోలీసులపై దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అతడు లొంగకపోవడంతో ఆత్మరక్షణ కోసం కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ కాలి భాగంలో తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. గాయపడిన నిందితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read:సముద్రంలో విమానాశ్రయం…!

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు పలు జిల్లాల్లో జరిగిన ఇల్లు చోరీలు, నగదు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి మరిన్ని కేసులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. అలాగే అతడి వద్ద నుంచి కొన్ని కీలక ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, భూషణ్ శ్రీకాంత్‌కు సంబంధించిన ఇతర నేరాలు, అతడితో సంబంధం ఉన్న వ్యక్తులపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క అడుగు….!బుల్లెట్ ట్రైన్ సర్వే షురూ…

తాజావార్తలు