Homeతెలంగాణఏపీకి సీఎం తొత్తు కావొచ్చు... ప్రజలు కాదు: కవిత

ఏపీకి సీఎం తొత్తు కావొచ్చు… ప్రజలు కాదు: కవిత

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ జర్నలిస్టు కేయూ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ, రాష్ట్ర ప్రజలు, జర్నలిస్టులు అలా ఉండాల్సిన అవసరం లేదని ఆమె విమర్శించారు.పొలిటికల్ కామెంట్ చేసినందుకు ఒక జర్నలిస్టును ఏపీ పోలీసులు వచ్చి అరెస్టు చేయడం, దానికి ఇక్కడి తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటని కవిత మండిపడ్డారు. అరెస్టు సమయంలో కేయూ రెడ్డిని పోలీసులు లాక్కెళుతుంటే ఆయన భార్యాపిల్లలు రోదించిన వీడియో హృదయ విదారకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ వాదాన్ని వేర్పాటు వాదమనే సినిమా నటుల విషయంలో ఇక్కడి పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కవిత ఎండగట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన: తెలంగాణలో భారీ, ఏపీలో మోస్తరు వర్షాలు

వందేళ్లలో మూడోసారి కరువు…! జూన్‌లో త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు