Homeతెలంగాణమునుగోడులో సరైనోడు.!

మునుగోడులో సరైనోడు.!

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురుగా ధీటైన అభ్యర్థి

  • ఈఎల్వి భాస్కర్ ను సిద్ధం చేస్తున్న భారత రాష్ట్ర సమితి

  • భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ గా నియోజకవర్గానికి సుపరిచితులు

  • విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో విస్తృత సేవలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా మాస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకత తో ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ.. బలమైన క్యాడర్ను సంపాదించుకొని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హవాకు బ్రేక్ వేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని చూస్తోంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి చూపు ఈఎల్ వి భాస్కర్ పై పడినట్లు తెలుస్తోంది. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్గా మునుగోడు ప్రజలకు ఇప్పటికే భాస్కర్ సుపరిచితులయ్యారు. విస్తృత సేవలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఆయన అయితే బలమైన అభ్యర్థి అవుతారని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఢీకొట్టగలరని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

  • ప్రముఖ పారిశ్రామికవేత్త..

మునుగోడు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ ఇరుగండ్ల భాస్కర్ ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన స్వగ్రామం మునుగోడు మండలం పరిధిలో ఉంది. రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఆయన రాణించారు. ఈఎల్వి గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మునుగోడు నియోజకవర్గాల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలకు ఉచిత సేవలు, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇటీవల వాటిని మరింత విస్తృతం చేశారు. అయితే ఇదంతా భవిష్యత్తు రాజకీయాల కోసమే చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ ఎల్ వి భాస్కర్ మాత్రం ఏ రాజకీయ పార్టీకి అనుకూల ప్రకటనలు చేయడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈ యల్ వి భాస్కర్ ను గులాబీ పార్టీ ప్రయోగించనున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.

  • కోమటిరెడ్డిని తట్టుకోవాలంటే..

ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. దాదాపు 40 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని తట్టుకోవడం ప్రభాకర్ రెడ్డికి అంత సులువు కాదు. అందుకే గులాబీ పార్టీ ప్రత్యామ్నాయ నేత కోసం ఆలోచన చేస్తోంది. ఆర్థికంగా బలమైన నేత, ఆపై క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు, ప్రజలతో మమేకమయ్యే నేత అయితే రాజగోపాల్ రెడ్డి ని ఓడించగలరు అని బిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆలోచిస్తోంది. పైగా ప్రభాకర్ రెడ్డి ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న టాక్ గులాబీ పార్టీలోనే ఉంది. అందుకే ఆయనను పక్కకు తప్పించి ఈ ఎల్ వి భాస్కర్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

  • రెడ్డి సామాజిక వర్గం నేతలు..

మునుగోడు లో రెడ్డి సామాజిక వర్గం నేతల ప్రాబల్యం ఎక్కువ. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం వారే గెలుస్తూ వస్తున్నారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది భారత రాష్ట్ర సమితి. ఈ ఎల్ వి భాస్కర్ ను రంగంలోకి దించడం ద్వారా.. త్రిముఖ పోటీలో ఘనవిజయం సాధించాలన్న ఆలోచన చేస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సైతం పోటీలో ఉంది. ఆ పార్టీకి సైతం బలమైన కేడర్ ఉంది. కానీ బిఆర్ఎస్ మాత్రం భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఎల్.వి భాస్కర్ ను రంగంలోకి దించడం ద్వారా.. మునుగోడును సొంతం చేసుకోవాలని ప్రణాళిక వేస్తోంది.

అయితే రాజకీయ రంగ ప్రవేశం పై ఈ ఎల్వి భాస్కర్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉండడంతో.. మునుగోడు పోటీ విషయంలో ఈ ఎల్ వి భాస్కర్ ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు