Homeతెలంగాణసమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే...! దర్శకుడు రాజ్ నిడిమోరు...

సమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే…! దర్శకుడు రాజ్ నిడిమోరు…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ మాట్లాడుతూ.. మా ఇంటి బంగారం నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ది ఫ్యామిలీ మ్యాన్, స్త్రీ లాంటి హిట్ ప్రాజెక్టులు చేసినా.. ఈ సినిమా ఇచ్చిన సంతృప్తి వేరేలా ఉంది. తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను జీవితాంతం మర్చిపోలేను అని అన్నారు.

Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!

అలాగే సినిమా ప్రారంభమైన సమయంలో సమంత వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ఆ సమయంలో సమంత సినిమాలకు దూరంగా ఉండాలని, ఇక నటించకూడదని కూడా అనుకుంది. కనీసం ఈ ఒక్క సినిమా అయినా చేయాలని నేను ఒప్పించాను. చివరకు ఆమె అంగీకరించింది అని రాజ్ వెల్లడించారు. సినిమా ప్రారంభ దశలో పెట్టుబడిదారులు కూడా ముందుకు రాలేదని ఆయన చెప్పారు. ఓటీటీ హక్కులు ఎలా అమ్ముడవుతాయి? ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు? అనే సందేహాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ సమంతలోని పూర్తి నటనను చూపించేలా సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

Also Read:కూట‌మి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్వెల్ పూర్త‌యింది…! అమర్ నాథ్ వ్యాఖ్యలు వైర‌ల్‌…

బడ్జెట్ పరిమితులు, సమయాభావం వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనా టీమ్ మొత్తం కలిసి సినిమాను పూర్తి చేసిందని రాజ్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన విజయంతో ఆ కష్టం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్త్రీ, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, సిటాడెల్: హనీ బన్నీ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్-డీకే జోడీకి, మా ఇంటి బంగారం మరో విజయంగా నిలిచిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read:బీడీ కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్… 2026-27 స్కాలర్‌షిప్స్ కోసం అప్లై చేసారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు