Homeవైరల్ఒక్క షాపింగ్ ఈ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది... రూ.13 వేలతో… కోట్ల విలువైన ఇల్లు గెలుచుకుంది!

ఒక్క షాపింగ్ ఈ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది… రూ.13 వేలతో… కోట్ల విలువైన ఇల్లు గెలుచుకుంది!

జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద ప్రయత్నాల వల్లే వస్తాయనుకోవడం తప్పు. కొన్ని సార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయం కూడా అదృష్టాన్ని, అద్భుతాన్ని సృష్టిస్తుంది. కేరళకు చెందిన యువతి అయేషా అమీర్ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా చేసిన షాపింగ్ ఆమెకు అనూహ్యంగా ఒక విలాసవంతమైన ఇంటిని అందించింది.

ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న అయేషా, ఇటీవల ఒక షాపింగ్ మాల్‌కి వెళ్లింది. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక ఆఫర్ పోస్టర్లు ఆమె దృష్టిని ఆకర్షించాయి. “విన్ యువర్ హోమ్” అనే డ్రాలో పాల్గొనడానికి కనీసం 500 దిర్హామ్‌లు (దాదాపు రూ.13 వేలు) విలువైన షాపింగ్ చేయాల్సి ఉంటుంది. సరదాగా ఆమె ఆ షాపింగ్ చేసి డ్రాలో పేరు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత ఈ విషయం పూర్తిగా మర్చిపోయింది.

కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. డ్రాలో ఆమె విజేతగా ఎంపికైందని, ఒక స్టూడియో అపార్ట్‌మెంట్ గెలుచుకుందని నిర్వాహకులు తెలిపారు. మొదట ఈ కాల్‌ను ఆమె నమ్మలేదు. ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనుకుంది. కానీ తర్వాత అధికారిక వివరాలతో వచ్చిన ఈ-మెయిల్ చూసిన తర్వాతే ఆమెకు అసలు విషయం అర్థమైంది.

ఇంత పెద్ద బహుమతి గెలుచుకున్నానని తెలుసుకున్న క్షణం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా, తాను, తన భర్త ఒక ఇల్లు కొనాలని చాలా రోజులుగా ఆలోచిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఎలాంటి ఖర్చు లేకుండా ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ లభించడం తమకు ఊహించని వరంగా మారిందని అయేషా పేర్కొన్నారు.

also read: “తల్లి హోదా ఒక్కటే సరిపోదు.. చిన్నారి కస్టడీ తండ్రికే” – పుణె కోర్టు కీలక తీర్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు