Homeఆంధ్ర ప్రదేశ్వైసిపికి కాపు కాసేలా.. నేడు కాపు నేతల కీలక భేటీ.!

వైసిపికి కాపు కాసేలా.. నేడు కాపు నేతల కీలక భేటీ.!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు నేతల కీలక సమావేశం ఆదివారం జరగనుంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ తరహాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నాయకులకు ఆహ్వానాన్ని అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన కాపు నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గడిచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు ఓటు బ్యాంకు పూర్తిగా దూరమైంది. పవన్ కళ్యాణ్ వల్ల కూటమికి కాపులంతా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో గడిచిన ఎన్నికల్లో దూరమైన కాపు ఓటర్లను మళ్లీ వైసీపీ వైపు తీసుకువచ్చేందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించేందుకు ఈ భేటీ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ముఖ్య నేత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు ఆ పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న సీనియర్లు హాజరు కానున్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి అటు తిరుపతి వరకు ఉన్న కాపు నేతలంతా సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే తోట త్రిమూర్తులు నుంచి ఆహ్వానాలు అందినట్లు చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి పార్టీతో సంబంధం లేదని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. భవిష్యత్తులను ఈ తరహా సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఇప్పటికే వెల్లడించారు. ఈ సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చిస్తారు అన్నదానిపై ప్రాధాన్యత నెలకొంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంతోమంది ముఖ్య నాయకులు వైసీపీలో కూడా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభావంతో దిగజ నాయకులుగా పేరుపొందిన వాళ్లు కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే కాపును ముఖ్య నాయకులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్న అన్యాయాలు, పెడుతున్న ఇబ్బందులు వంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు కాపు నాయకులు కార్యాచరణ ప్రకటించే క్రమంలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.

యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉంటుందా.!

తోట త్రిమూర్తులు ఈ సమావేశానికి సారథ్యం వహిస్తున్నారు. ఇది సాధారణ సమావేశంగానే చెబుతున్నప్పటికీ కీలకమైన నిర్ణయాలకు అవకాశం ఉండవచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులను చెరువు చేసే ప్రక్రియకు ఈ సమావేశం నాంది పలుకుతుంది అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహా సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో కాపులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కాపులపై జరుగుతున్న దాడులు, అనేక చోట్ల వేధింపులు, ఇబ్బందులకు గురి చేస్తున్న తీరును చర్చించే అవకాశం ఉంది. అలాగే గత వైసిపి ప్రభుత్వం లో కాపు నేస్తం కింద అందించే సహాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిలిపివేయడం పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాపు కార్పొరేషన్కు నిధులు కేటాయించాలన్న డిమాండ్ ను ప్రధానంగా వినిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం కాపు నేతలంతా అక్కడే లంచ్ చేసి సమావేశాన్ని ముగించనున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు