Homeతెలంగాణరేవంత్ రెడ్డి వి చిల్లర వేషాలు...కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి వి చిల్లర వేషాలు…కల్వకుంట్ల కవిత

  • తెలంగాణలో రోడ్డుకు ట్రంప్ పేరా?

  • తెలంగాణ ప్రజలను అవమానించేలా రేవంత్ చర్యలు

  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని పేరు పెట్టటం…తెలంగాణ ప్రజలను అవమానించటమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఒక్క మహనీయుని పేరు రేవంత్ రెడ్డికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.

తెలంగాణకు ట్రంప్ ఏం చేశాడని ఆయన పేరు పెడుతున్నారో చెప్పాలంటూ కవిత “ఎక్స్” లో ట్వీట్ చేశారు. ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో మన తెలంగాణ పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆయన పేరు ఇక్కడి రోడ్లకు పెడతారా అంటూ విమర్శించారు. రేవంత్ చర్య సొంత ప్రజలను అవమానించేలా ఉందన్నారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబానికి అమెరికా వీసాలు సులభంగా క్లియర్ అవటానికి తప్ప ఈ నిర్ణయం దేనికి పనికిరాదని విమర్శించారు.

  • రేవంత్ రెడ్డి వి చిల్లర వేషాలు

రేవంత్ రెడ్డి కేవలం ఇంటర్నేషనల్ మీడియాలో తన పేరు రావాలన్న ఉద్దేశంతో చేసిన చిల్లర పని ఇదంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ తో పెట్టుబడులు రావన్నారు. ఇక్కడ ఉండే మౌలిక వసతులు, మ్యాన్ పవర్, టాలెంట్ ను చూసి మాత్రమే అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని కవిత చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు