Homeక్రైమ్పెన్నులు కొంటున్నారా జాగ్రత్త.. బాంబులు ఉంటున్నాయన్న పోలీసులు

పెన్నులు కొంటున్నారా జాగ్రత్త.. బాంబులు ఉంటున్నాయన్న పోలీసులు

క్రైమ్ మిర్రర్, జాతీయం:- వేసవి సెలవులు ముగియడంతో స్కూల్స్‌ మళ్లీ తెరుచుకుంటున్నాయి. బడికి వెళ్లే పిల్లల కోసం తల్లిదండ్రులు కొత్త పుస్తకాలు, పెన్నులు, యూనిఫామ్‌, షూస్‌ వంటివి కొనడం సహజం. అయితే, కొత్త పెన్నులు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పెన్నుల్లో బాంబులు పెడుతున్నారంటూ తాజాగా పోలీసులు చేసిన హెచ్చరిక సంచలనం సృష్టిస్తోంది. పెన్నులు తరహాలో ఉండే వాటిల్లో బాంబులు పెడుతున్నారని పోలీసులు చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హెచ్చరిక ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌శాఖ రాష్ట్ర ప్రజలకు చేయడం మరింత ప్రాధాన్యంగా మారింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నులు విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌శాఖ ప్రజలకు సూచించింది. ఈ హెచ్చరిక యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు బాంబులు పెట్టేందుకు ఆస్కారం ఉన్న పెన్నుల ఫొటోలను కూడా విడుదల చేశారు.

సంఘ విద్రోహ శక్తుల పనే..

పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని, సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులుగా వాటి ఆకారంలో ఉండే బాంబులు తయారు చేశారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే వాటికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందడంతో వాటి ఫొటోలను కూడా విడుదల చేశారు. పెన్‌ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు సూచనలు చేశారు. బులంద్‌షహర్‌ జిల్లా పోలీసులు ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్నుల్లా కనిపించే అనుమానాస్పదంగా కనిపించే వస్తువులను తాకవద్దంటూ పోలీసులు హెచ్చరించారు. ఇవి విస్పోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, ఎడారి లాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. అటువంటి వస్తువులు కనిపిస్తే వెంటనే 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం ఈ విషయంలో అత్యంత కీలకమని పోలీసులు పేర్కొన్నారు. శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాలని, కాబట్టి, అటువంటివి కనిపిస్తే తాకుండా వెంటనే తెలియజేయాలని కోరారు. పోలీసులు తాజాగా జారీ చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Anchor Vishnu Priya: ఇప్పటి వరకు ఐదుగురితో ఆ పని చేశా.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు