నెల్లూరు, క్రైమ్ మిర్రర్: నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి ముగ్గురు ఉరేసుకొని మృతి చెందడం ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మృతులను విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరణ వాంగ్ములం బీరువాలోని ఫోటో అల్బంలో వుందని ఒక చీటి రాసి బిరువాకు అతికించారు.
Also Read:కాంగ్రెస్ మాటతప్పడంపై తీవ్ర నిరాశలో షర్మిళా…?
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ దారుణ నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఆర్థిక, వ్యక్తిగత, ఇతర పరిస్థితులపై ఆరా తీస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read:US- Iran Deal: యుద్ధానికి ముగింపు.. ఇరాన్ తో డీల్ కుదిరిందన్న ట్రంప్