శ్రీకాకుళం, క్రైమ్‌మిర్రర్: పరువు కోసం కన్న కూతురిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణతర్లాకు చెందిన హరిణి(24)ని, టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన తన మేనమామ దంతేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేసారు. వీరికి ఒక కుమారుడు. పెళ్లయ్యాక డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్-1 పరీక్షల శిక్షణ కొరకు హైదరాబాద్‌కు వెళ్ళిన హరిణికి నాగేంద్ర అనే వ్యక్తి పరిచాయం అయ్యాడు. భర్తకు విడాకులు ఇచ్చి అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన హరిణిని కుటుంబసభ్యులు పలుమార్లు నిర్బంధించి, కొట్టారు.
Also Read: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2026: ప్రతి చిన్నారి భవిష్యత్తును కాపాడాల్సిన సమయం
వీటిపై గతంలోనే బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. గత నెల 30న స్వగ్రామానికి వెళ్లి విడాకుల వ్యవహారం గురించి మాట్లాడుదామని హరిణిని తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. ప్రమాదాన్ని ముందే గ్రహించిని హరిణి జూన్ 5లోగా తాను తిరిగి రాకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా తనకు ఆపద తలపెట్టి ఉంటారని వీడియో రికార్డ్ చేసి నాగేంద్రకు పంపింది. పథకం ప్రకారమే హరిణిని గత నెల 31 అర్ధరాత్రి హత్య చేసి, గుండెనొప్పితో చనిపోయిందని, ఆత్మహత్య చేసుకుందని బంధువులకు చెప్పి అంత్యక్రియలు కూడా పూర్తి చేసారు.
Also Read:మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..
కుటుంబసభ్యులు. 5వ తేదీ వరకు ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వీడియోను శక్తి యాప్లో నాగేంద్ర పంపగా సొర్లిగాం గ్రామానికి వెళ్లి పోలీసులు విచారించారు. హరిణి మరణించి అప్పటికే 6 రోజులు అయిందని తేలింది. దాంతో దర్యాప్తు జరిపి భర్త, తల్లి, తాతను అరెస్ట్ చేసారు.
Also Read:సంక్షేమం…సుపరిపాలన అందిస్తున్నాం….! సీఎం చంద్రబాబు