సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్:భార్య భర్తల మధ్య గొడవలు ఒక కుటుంబాన్ని విషాదంలో నెట్టేసిన ఘటన సంగా రెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో కలిసి రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
Also Read:ఇకపై డిజిటల్ పౌర సేవల కేంద్రాలుగా సహకార సంఘాలు.. 908 సంఘాల్లో సేవలు
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ (32), సవిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రక్షిత్ (8), అనన్య (5) ఉన్నారు. కొంతకాలంగా సవితతో కృష్ణకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై కృష్ణ ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్లాడు.
Also Read:కేంద్ర మంత్రులుగా ఏపీకి చెందిన మరో ఇద్దరికి అవకాశం.. రేసులో లింగమనేని, వేమిరెడ్డి.!
అక్కడ ఇద్దరు పిల్లలను నిజాంసాగర్‌లోకి నెట్టి, కృష్ణ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రక్షిత్, అనన్య మృతదేహాలను వెలికితీశారు. కృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు కృష్ణ మృతదేహం కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2026: ప్రతి చిన్నారి భవిష్యత్తును కాపాడాల్సిన సమయం