Hometelanganaకాంగ్రెస్ Vs బిజెపి అన్నట్టు సీన్ క్రియేట్...!

కాంగ్రెస్ Vs బిజెపి అన్నట్టు సీన్ క్రియేట్…!

  • బిఆర్ఎస్ పై గురి…!

  • తెలంగాణలో గులాబీ పార్టీని సైడ్ చేసే పనిలో సీఎం రేవంత్

  • కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు సీన్ క్రియేట్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీని సీఎం రేవంత్ సైడ్ చేస్తున్నారా…? ప్రాంతీయ పార్టీ మనుగడ లేకుండా చేయాలని భావిస్తున్నారా? కాంగ్రెస్ వర్సెస్ బిజెపి పోరాటం మాదిరిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక సరికొత్త వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య వైరం కొనసాగింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్న మాదిరిగా మారిస్తేనే.. గులాబీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చు అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే అత్యంత చాణుక్యంతో పావులు కదుపుతున్నారు.

Also Read: Breaking: కర్త,కర్మ, క్రియ ఆయనే…త్వరలో జగన్ కు నోటీసులు…!

తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ఆధారంగా నడిచే భారత రాష్ట్ర సమితిని పూర్తిగా సైడ్ చేసే పనిలో ఉన్నారు. ప్రధాన పోటీ జాతీయ పార్టీల మధ్య ఉండేలా సరికొత్త సీన్ క్రియేట్ చేస్తున్నారు రేవంత్. అందుకే ఇటీవల భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.

టార్గెట్ కిషన్ రెడ్డి..
గులాబీ పార్టీ నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాస్త దూకుడుగానే పదునైన మాటలతో విరుచుకుపడేవారు. అటువంటి రేవంత్ ఇటీవల సడన్ గా రూటు మార్చారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు లక్షంగా సాగే ఆయన విమర్శలు… ఇప్పుడు నేరుగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర నేత కిషన్ రెడ్డి పై టర్న్ తీసుకున్నాయి.

Also Read: అమెరికా దాడులు…గ‌ల్లంతైన ముగ్గురు భార‌తీయులు మృతి…!

తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, ధాన్యం కొనుగోలు వంటి అంశాలను తెరపైకి తెస్తూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించడం ద్వారా.. రాష్ట్రంలో తానే తెలంగాణ హక్కుల ప్రధాన పోరాట యోధుడిగా చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు.

బిజెపి ధీటుగానే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై ఘాటుగానే స్పందిస్తున్నారు బిజెపికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగానే నిధులు ఇస్తోందని.. అయితే బహిరంగంగా చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. అయితే ఈ మొత్తం పరిణామాలతో గులాబీ పార్టీ సైడ్ అవుతుంది. మీడియా అటెన్షన్ కాంగ్రెస్ తో పాటు బిజెపి పైపడుతోంది.

Also Read: తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన.. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్!!

నేషనల్ మీడియా సైతం ఈ రెండు పార్టీలకే ప్రాధాన్యమిస్తోంది. ప్రజల ఆలోచన నుంచి గులాబీ పార్టీ నేతలను బయటపడేయాలన్నది రేవంత్ వ్యూహంగా అర్థం అవుతోంది. మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టి వ్యూహరచనతోనే ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read: Alexander Zverev life story: శరీరం పోరాడింది… మనసు గెలిచింది..!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు