Homeక్రైమ్ఖమ్మంలో మానవ మృగం.. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

ఖమ్మంలో మానవ మృగం.. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఖమ్మంలో ఒక మానవ మృగం దారుణానికి పాల్పడింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడులా మారిపోయి దారుణంగా వ్యవహరించాడు. అత్యంత కిరాతకంగా 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ దారుణం బయటపడకూడదన్న ఉద్దేశంతో మరింత కర్కషంగా వ్యవహరించాడు. దాడికి పాల్పడిన తర్వాత ఆ చిన్నారిని భవనం నాలుగో అంతస్తుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేసి చేతులు దులుపుకున్నాడు. తీవ్ర గాయాలతో అపస్మార్క స్థితికి చేరుకున్న ఆ చిన్నారి రెండు రోజులపాటు చికిత్స అనంతరం కళ్ళు తెరవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అంకుల్ చేసిన కిరాతకం గురించి ఆ చిన్నారి చెప్పిన తీరు అక్కడ ఉన్న వారిని కన్నీళ్లు పెట్టించింది. ఒకవేళ చిన్నారి కోలుకోకపోయి ఉంటే ప్రమాదంగానే అంతా భావించేవారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. నిందితుడని కఠినంగా శిక్షించాలి అన్న డిమాండు సర్వత్రా వినిపిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని ఉపేక్షించవద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అసలు ఏం జరిగిందంటే..?
తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఖమ్మం సమీపంలోని ఒక మండలానికి చెందిన 12 ఏళ్ల బాలిక ఒక గురుకుల పాఠశాలలో చదువుతోంది. బాలిక తాత ఖమ్మం లోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో ఆమె తాత ఇంటికి వచ్చింది. ఈనెల ఆరవ తేదీన బాలిక ఆడుకునేందుకు అపార్ట్మెంట్ రెండో అంతస్తుకు వెళుతుండగా అదే అపార్ట్మెంట్లో నివసించే మహమ్మద్ గౌస్ పాషా (45) బాలికను వెనక నుంచి పట్టుకొని అత్యాచార ప్రయత్నం చేశాడు. పాషా తీరుకు భయపడిన బాలిక కేకలు వేయగా తన దుశ్చర్య బయటపడకూడదన్న ఉద్దేశంతో చిన్నారిని బలవంతంగా అపార్ట్మెంటులోని నాలుగో అంతస్తుకు తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి చిన్నారిని తోసేయడంతో బాలిక అపార్ట్మెంట్ కింద ఉన్న గోడపై పడింది. ఆ కేక విన్న బాలిక తాత వచ్చి చూడగా రక్తపు మడుగులో మనవరాలు కనిపించింది. బాలికను వెంటనే ఖమ్మంలోనే ఒక ఆసుపత్రికి తరలించగా వెన్నెముక రెండుచోట్ల, కాలు, కుడి భుజం విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. బాలిక అపస్మార్క స్థితిలో ఉండగా ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందకి పడిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ అంకుల్ ఇలా చేశాడు అని బాలిక చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు మహమ్మద్ గౌస్ పాషా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఫోక్సో తోపాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు గౌడ్స్ పాషాను పోలీసులు మందలించగా తనకేమీ తెలియదని చిన్నారి చెప్పిందంతా అబద్ధమని బుకాయించినట్లు తెలుస్తోంది. పాషా అరెస్టును తెలుసుకున్న న్యాయాధికారి ఆసుపత్రికి వెళ్లి బాలిక వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. బాధిత చిన్నారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులో ఒక ఆసుపత్రికి తరలించారు. పది రోజులుగా తాతయ్య ఇంట్లో ఉంటున్న బాలికపై మహమ్మద్ గౌస్ పాషా వారం రోజుల క్రితం కూడా చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. దీంతో పాషా కనిపించిన ప్రతిసారి తాను తప్పించుకుని తిరుగుతున్నానని ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. మాటల్లో చెప్పలేని విధంగా ప్రవర్తించాడని బాలిక వివరించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులు తమదైన శైలిలో ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు