Homeతెలంగాణకేటీఆర్ వర్సెస్ కవిత!

కేటీఆర్ వర్సెస్ కవిత!

•అన్నా చెల్లెలి పోటా పోటీ పాదయాత్ర
•తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హిట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు అన్నట్టు సాగుతున్నాయి. మరోసారి తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు నాయకులు పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంతలోనే తాను సైతం పాదయాత్ర చేస్తానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు చేస్తానని స్పష్టం చేశారు.

అధికారాన్ని తెచ్చి పెట్టిన పాదయాత్రలు..
తెలుగు నాట పాదయాత్రలు ప్రతి రాజకీయ పార్టీని అధికారాన్ని తెచ్చిపెట్టాయి. పాదయాత్ర చేసిన నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర.. పదేళ్ల టిడిపి పాలనకు చెక్ పెట్టింది. 2012లో చంద్రబాబు వస్తున్న మీకోసం అంటూ చేసిన పాదయాత్ర 2014లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. 2017లో జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో 2019లో అధికారంలోకి రాగలిగారు. 2023లో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రతో టిడిపి అధికారంలోకి రాగలిగింది. అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. వరుసగా ఎన్నికల్లో పరాజయాలతో ఉన్న పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

కవిత ప్రత్యేక ప్రకటన..
కేటీఆర్ పాదయాత్ర సన్నాహాల్లో ఉండగా.. చెల్లెలు కవిత కూడా పాదయాత్ర పై సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేపడతామని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో.. లక్ష్మీదేవి పల్లి బ్యారేజీ సాధన కోసం త్వరలో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. అయితే ఏకకాలంలో అన్నా చెల్లెలు పాదయాత్రలు కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ రెండు పాదయాత్రలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు