క్రైమ్ మిర్రర్,తమిళనాడు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యవాటమే చవిచూసిన డీఎంకే అధినేత స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంటామని భావించిన ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను తెలుసుకునే పనిలోపడ్డారు.
అదే సమయంలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంతో పాటు కీలక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గతంగా పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్‌కు ఫలితాలు షాక్ కు గురి చేశాయి.
పార్టీ ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. దారుణ పరాభవాన్ని మాత్రం ఆయన తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఆయన పడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలో ఉన్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సంస్థగతంగా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టాలిన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన స్టాలిన్..
తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడానికి గల కారణాలను నియోజకవర్గాల వారీగా విశ్లేషించేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పార్టీ వాలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకునేందుకు అనుగుణంగా ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైటును కూడా ప్రారంభించారు.
ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడు కి ఈ కమిటీ పంపించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ కమిటీ ఏర్పాటు యొక్క ఉద్దేశాన్ని కూడా స్టాలిన్ పార్టీ నాయకులకు తెలియజేసినట్లు చెబుతున్నారు. పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శిల సంఖ్యను 115కు పెంచనున్నారు.
తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శిల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతల్లో కేఎన్ నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని పార్టీ నుంచి సమాచారం అందుతోంది.
ఇకపోతే ఎన్నికల నివేదిక ఆధారంగా జూన్ 10 తర్వాత డిఎంకె పార్టీ నిబంధనలను అనుసరించి భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దొరై మురుగన్ ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎంకే స్టాలిన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా స్టాలిన్ ఇప్పటి నుంచే అడుగులు వేయడంతోపాటు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.