Homeరాజకీయంకాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన డీఎంకే.. ఇండి కూటమి సమావేశానికి గైర్హాజరు

కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన డీఎంకే.. ఇండి కూటమి సమావేశానికి గైర్హాజరు

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- కాంగ్రెస్‌ పార్టీకి డీఎంకే షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమికి దూరంగా వెళ్లేందుకు డీఎంకే సిద్ధమైంది. జూన్‌ 8న ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి కూటమిలోని పార్టీలు హాజరుకావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయా పార్టీలకు సమాచారాన్ని అందింది. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమిళనాడుకు చెందిన డీఎంకే ఆసక్తి చూపించడం లేదు. ఈ మేరకు ఆ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనే సమావేశానికి హాజరుకావడం లేదంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా డీఎంకే జరుగుతున్నట్టైంది. కొద్దిరోజులు కిందట తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీ కూటమిగానే బరిలోకి దిగడాయి. అయితే, ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని పార్టీలు పూర్తిస్తాయిలో మెజార్టీ సాధించలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఐదు స్థానాలను గెల్చుకుంది. అయితే, 108 స్థానాలతో మెజార్టీ స్థానాలను దక్కించుకున్న టీవీకే పార్టీ.. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అడుగు దూరంలో నిలిచింది. డీఎంకే మిత్రపక్షంగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ.. డీఎంకేతో సంప్రదింపులు జరపకుండానే టీవీకే పార్టీకి మద్ధతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై అప్పటి నుంచి డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉంది. కూటమి పార్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ డీఎంకేనేతలుకాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశ సంక్షేమంపై గళం విప్పుతామని ప్రకటన..

ఇండి కూటమి సమావేశానికి హాజరుకాబోమని చెప్పిన డీఎంకే కీలక ప్రకటన చేసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికల తరువాత డీఎంకేకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన ద్రోహం వల్ల తమ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఆ పార్టీ పేర్కొంది. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ జూన్‌ 8న ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండి కూటమి సమావేశంలో డీఎంకే పాల్గొనబోదని స్పష్టం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనే సమావేశం కావడంతో హాజరుకాబోమని వెల్లడించింది. అదేసమయంలో ఈ సమావేశానికి హాజరుకాకపోయినా, సమావేశంలో పాల్గొనే ఇతర పార్టీలు ప్రస్తావించే దేశ సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ఎప్పటిలాగే తమ గళాన్ని వినిపిస్తామని డీఎంకే అందులో పేర్కొంది. ఈ నిర్ణయంతో దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌ పార్టీకి దూరమైనట్టు అయింది. ఇకపోతే, కాంగ్రెస్‌కు దూరంగా జరుగుతున్నడీఎంకేను దగ్గర చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో బీజేపీ అగ్ర నాయకులు సంప్రదింపులు జరుతుపుతున్నట్టు తెలిసింది. 2029 ఎన్నికల నాటికి తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకేను దగ్గర చేర్చుకోవడం ద్వారా మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకునే వూహ్యాన్ని బీజేపీ అమలు చేస్తోంది. మరి బీజేపీ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి. ఇదిలా ఉంటే తమిళనాట బలమైన పార్టీగా ఉన్న డీఎంకే దూరం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతాపరాధం చేసిందని పలువురు పేర్కొంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు