హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రాయదుర్గం భూములు రికార్డ్ బ్రేక్ చేశాయి. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో టీజీఐఐసీ భూములు వేలం వేశారు. ఎకరం భూమి రికార్డ్ స్థాయిలో 237 కోట్లు పలికింది. దక్షిణ భారత దేశంలోనే అల్ టైమ్ రికార్డ్ ఇది. సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం నిర్వహించారు. మొత్తం వేలం విలువ రూ.1490 కోట్లు అని అధికారులు తెలిపారు.
ఇక గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలికింది. 7.67 ఎకరాల భూమి వేలం వేయగా ఈ రికార్డ్ ధర పలికింది. 7 ఎకరాలకు మొత్తం 1357.59 కోట్లు ఆదాయం ఆర్జించింది టిజిఐఐసి.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో టిజిఐఐసి (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) భూములు వేలం వేశారు. టిజిఐఐసి నిర్ణయించిన కనీస ధర 139 కోట్ల రూపాయలు కాగా వేలం ముగిసే సమయానికి అది దాదాపు 237 కోట్లకు చేరింది.