Homeఆంధ్ర ప్రదేశ్బాబోయ్ పులి.. మళ్లీ హడలెత్తిస్తున్న టైగర్...!

బాబోయ్ పులి.. మళ్లీ హడలెత్తిస్తున్న టైగర్…!

క్రైమ్ మిర్రర్, ఏపీ స్టేట్ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పులి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. గడిచిన నాలుగు నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులను పెద్దపులి భయాందోళనలకు గురిచేస్తుంది. అప్పట్లో అధికారులు పెద్ద రెస్క్యూ చేసి పులిని పట్టుకున్నారు. దీంతో జిల్లాకు చెందిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే పులిని పట్టుకొని కొద్ది రోజులు గడిచాయో లేదో మళ్లీ పులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా ఒక పులి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయపెడుతోంది. ఇటీవల రాత్రి వేళలో పశువులపై దాడి చేస్తూ పోలవరం జిల్లాలో తిరుగుతూ కళకళ సృష్టిస్తుంది.

దీంతో మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పుడు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

ఎప్పటికప్పుడు పులి సంచారంతో ఆందోళన..

గత కొన్నాళ్లుగా పెద్దపులి గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పోలవరం జిల్లాలో కొద్దిరోజుల కిందట పులి సంచారం చేస్తూ కలకాలం రేపింది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్దపులి.. మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.

తాజాగా ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్దిపురం పరిసరాల్లో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. గతంలో పులిని బంధించినప్పుడు పులి మేడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పులి ఎక్కడుందని ఖచ్చితమైన వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పులి పోలవరం జిల్లాలోని వేము లోవ, పిడత మామిడి, రాముల దేవపురం, వడ్డీ చెరువు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు పర్యటించి అక్కడ ప్రజలను అప్రమత్తం చేశారు.

గడిచిన నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్ద పులి దాడి చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రి తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్ళవద్దని డిఎఫ్ఓ ప్రజలకు సూచించారు. మరోసారి పెద్దపులి సంచారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక రెస్ట్యూట్ టీములు రంగంలోకి దిగాయి. వీలైనంత త్వరలోనే పులిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. దట్టమైన అడవి కావడం వలన పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారుతోందని, అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పులిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు