Homeఆంధ్ర ప్రదేశ్జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా!

•విప్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం
•పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సమర్పణ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు.. వైయస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఇటీవల తన వ్యక్తిగత అంశాలతో వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రం సమర్పించిన అనంతరం అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కారణాలవల్లే విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు..
రైల్వే కోడూరు కు చెందిన ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ వివాదం పై అప్పట్లోనే జనసేన హై కమాండ్ స్పందించింది. విచారణకు గాను ఒక త్రిశక్తి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ ను విప్ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో అంతర్గత భేటీలో… ఈ మొత్తం వ్యవహారంపై ఆయన అధినేతకు పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. సదరు మహిళా ఉద్యోగితో తనకు పాత పరిచయాలు ఉన్న మాట వాస్తవమేనని.. గత కొంతకాలంగా ఆమె తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. కొందరు స్థానిక నేతలతో కలిసి తన రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు ఈ హనీ ట్రాప్ అన్నారని వివరించారట. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు, డిజిటల్ డాక్యుమెంట్లను ఆయన పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయేంతవరకు అధికారిక పదవుల్లో ఉండడం సంస్థ కాదని భావించి తాను తప్పుకున్నట్లు ఆయన వివరించారు.

ప్రత్యర్థులకు అస్త్రాలుగా..
అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనపై లైంగిక ఆరోపణలు ప్రత్యర్థులకు రాజకీయ వరంగా మారాయి. సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ కు కూడా గురయ్యారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే గతం నుంచి ఆమెతో సంబంధాలు ఉన్నట్లు స్వయంగా అరవ శ్రీధర్ ఒప్పుకున్నారు. కానీ డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన తర్వాతనే ఇది కాస్త వివాదానికి దారితీసింది. గతంలో పార్టీ కార్యవర్గ సమావేశాల్లోనే పవన్ కళ్యాణ్ లీడర్ల వ్యక్తిగత ప్రవర్తన పై తీవ్రంగా హెచ్చరించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే పదవుల నుంచి దూరం పెడతానని బలమైన నైతిక సందేశాన్ని ఇప్పుడు ప్రజల్లోకి పంపారు. అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయడంతో.. మరో ఎమ్మెల్యే కు ఈ చాన్స్ దక్కే అవకాశం ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు