Homeఆంధ్ర ప్రదేశ్కింజరాపు రామ్మోహన్ నాయుడుకి షాక్‌...! కేంద్రం కీల‌క నిర్ణ‌యం...

కింజరాపు రామ్మోహన్ నాయుడుకి షాక్‌…! కేంద్రం కీల‌క నిర్ణ‌యం…

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కు అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. దీంతో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పకుండా వర్గాల్లో ఉంది. అయితే కొంతమంది శాఖల మార్పు కూడా ఉండబోతుందన్నది ఒక టాక్. ప్రధానంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు అనివార్యం అని తెలుస్తోంది. ఆయనకు గతంలో తన తండ్రి నిర్వర్తించిన శాఖలను కేటాయిస్తారని సమాచారం.

హ్యాట్రిక్ విజయం…

శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2012లో కింజరాపు ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేసరికి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో రామ్మోహన్ నాయుడుకు ఏకంగా పౌర విమానయాన శాఖ దక్కింది.

రెండేళ్లుగా ఆ పదవి నిర్వర్తిస్తున్నారు రామ్మోహన్ నాయుడు. అయితే వరుసగా విమాన ప్రమాదాలు, వివిధ వివాదాలతో టార్గెట్ అయ్యారు రామ్మోహన్ నాయుడు. అయితే ఇప్పటికే విమానయాన రంగం ప్రైవేటీకరణ అయింది. అందుకే అది పెద్దగా కీలక శాఖగా భావించడం లేదు. అయితే ఈసారి ఆ శాఖను మార్చి గతంలో ఎర్రం నాయుడు నిర్వర్తించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ను రామ్మోహన్ నాయుడుకు ఇచ్చేందుకు ప్రధాని మోదీ సిద్ధపడినట్లు తెలుస్తోంది.

అప్పట్లో తండ్రి…

1996లో ఎర్రం నాయుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి.. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దేవే గౌడ, అయితే గుజ్రాల్ ప్రభుత్వంలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. దేశంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఇప్పుడు అదే శాఖను కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అప్పగిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఏపీకి కేంద్ర ప్రభుత్వ పరంగా సింహ భాగం ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇప్పటికే దీనిపై కసరత్తు జరిగినట్లు సమాచారం. రామ్మోహన్ నాయుడు శాఖ మార్పుపై చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఒకప్పుడు తన తండ్రి నిర్వర్తించిన శాఖలను రామ్మోహన్ నాయుడు కు కేటాయిస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు