క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వీరు వులవాల దర్శకత్వంలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం “పురుషహ” (Purushaha) ఈ రోజే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఈ సినిమాకు నటీనటులు & సాంకేతిక నిపుణులుప్రధాన తారాగణం బత్తుల పవన్ కళ్యాణ్ (పరిచయం), సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కుర. దర్శకత్వం వీరు వులవల, నిర్మాత బత్తుల కోటేశ్వర రావు (కళ్యాణ్ ప్రొడక్షన్స్), సంగీతం శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల, ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ మరియు డ్రామా కలయికతో సాగుతుంది.
ముఖ్యంగా భార్యల నుండి విడాకుల నోటీసులు అందుకుని, ఫ్యామిలీ సమస్యలతో సతమతమవుతున్న ముగ్గురు భర్తల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో కమ్యూనికేషన్ లోపం వల్ల వచ్చే ఫ్యామిలీ ఇబ్బందులను వ్యంగ్యంగా, వినోదాత్మకంగా మరియు సూపర్ హీరో-స్టైల్ ట్విస్ట్‌తో ఇందులో చూపించారు.