క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ పెరిగింది. యాక్షన్, డైలాగ్స్, ఎన్టీఆర్ లుక్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ముందుగా మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ను సంప్రదించారట. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టోవినో థామస్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. డ్రాగన్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా, డేట్స్ సమస్యల కారణంగా ఆ సినిమా చేయలేకపోయానని తెలిపారు.
పెద్ద బడ్జెట్ తెలుగు సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని, అలా చేస్తే మలయాళంలో తాను కమిట్ అయిన ఇతర సినిమాలు మిస్ అయ్యే పరిస్థితి వస్తుందని ఆయన వివరించారు. ఒక తెలుగు సినిమాకు ఏడాది పాటు డేట్స్ ఇస్తే, నాలుగు మలయాళ సినిమాలు చేయలేను అని టోవినో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పళ్లి చట్టంబితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.ఇక డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ఇది 1967 నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతర్జాతీయ ఓపియం ట్రేడ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుందని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్ లూగర్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో డ్రాగన్ మరో భారీ పాన్ ఇండియా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.