Homeఆంధ్ర ప్రదేశ్బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి లోకేష్ పై వైయస్ జగన్ కౌంటర్

బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి లోకేష్ పై వైయస్ జగన్ కౌంటర్

క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- ఏపీలో కూటమి నాయకులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. గత కొద్దిరోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విశాఖకు తమది గూగుల్ తెచ్చిన పార్టీ అయితే, వాళ్లది గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించిన మంత్రి లోకేష్.. బోతార్ నాట్ సేమ్ అంటూ తన మామ నందమూరి బాలకృష్ణ డైలాగును పేల్చారు. కొద్దిరోజులుగా ఇవే తరహాలో వ్యాఖ్యలు ఆయన అనేక సందర్భాల్లో చేస్తూ వైసీపీని ఉద్దేశించి ఇరకాటంలో పెడుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

బోతార్ నాట్ సేమ్ అంటూ రివర్స్ కౌంటర్..

మంత్రి లోకేష్ ప్రభుత్వ సమావేశాల్లో బోత్ ఆర్ నాట్ చేయమంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్న జగన్మోహన్ రెడ్డి.. బోత్ కెన్ నెవర్ బి సేమ్ అంటూ విమర్శలు గుప్పించారు. ‘వెన్నుపోటుతో పార్టీని లాక్కొని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ.. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా హిస్టరీ. బోత్ కెన్ నెవర్ బి సేమ్’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ ప్రజలకు ద్రోహం చేయడం, మేనిఫెస్టోను చిత్తుబుట్టలో పడేయడం, ప్రజలను వాడుకోవడం ఆ తరువాత వదిలేయడం మీ క్యారెక్టర్. కానీ మేము ఆరు నూరైనా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్. బోత్ కెన్ నెవర్ బి సేమ్,’ అంటూ లోకేష్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీ క్రెడిట్ చోరీ చేయడం మీ స్టైల్. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశ లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేయడం మా చరిత్ర. వీటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. బోత్ కెన్ నెవర్ బి సేమ్’ అంటూ జగన్మోహన్ రెడ్డి బాలయ్య డైలాగులతోనే మంత్రి లోకేష్ వ్యాఖ్యలను కౌంటర్ చేశారు. ‘ఐదేళ్లలో పారదర్శకంగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర. మీరు రెండేళ్లలో మాకంటే ఎక్కువ అప్పుచేసి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న అన్ని పథకాలను రద్దుచేసి. మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను మోసాలుగా పెట్టడం మీ చరిత్ర’ బోత్ కెన్ నెవర్ బీ సేమ్ తెలుసుకోవాలంటూ మంత్రి నారా లోకేష్ కు జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. లోకేష్ కు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారంటూ వైసిపి శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు