హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: దుండిగల్ లో ఒక మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిందితులు వీడియోలు తీసి పలుమార్లు బాలికను బ్లాక్మెయిల్ చేసారు. దుండిగల్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలోని ఓ షామియానా దుకాణంలో పనిచేస్తూ రోజూ అటు వైపు నుండి వెళ్తున్న బాలికపై శివకుమార్ అలియాస్ మట్టు(20) అనే యువకుడు కన్నేసాడు. ఒకరోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
బాలిక మౌనంగా ఉండడాన్ని అదునుగా చేసుకుని తన స్నేహితుడు నిజాంపేట రాము(30)తో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఫొటోలు వీడియోలు తీసి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు. దీంతో నిందితుల నుండి వరుస వేదింపులు తాళలేక తల్లిదండ్రులకు బాలిక జరిగిన దుర్ఘటన గురించి వివరించింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించారు.