Homeతెలంగాణపురుష మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది - హీరో పవన్ కళ్యాణ్...!

పురుష మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది – హీరో పవన్ కళ్యాణ్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. బత్తుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ* .. ‘‘పురుష:’ సినిమాని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నిర్మాత కోటేశ్వరరావు గారికి, సరస్వతి గారికి థాంక్స్. మా దర్శకుడు వీరు గారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నాకు ఈ జర్నీలో ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సతీష్ గారు మా అందరినీ ఎంతో అద్భుతంగా చూపించారు. నా కెమెరా ఫియర్‌ను ఆయనే తొలగించారు. శ్రవణ్ గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు.

రవి గారు మాకు మంచి సెట్స్ వేసిచ్చారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. వారే నా సిగ్గు, భయాన్ని, బిడియాన్ని పోగొట్టారు. వెన్నెల కిషోర్ గారితో, రాజీవ్ కనకాల గారితో, వీటీవీ గణేష్ గారితో వర్క్ చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. రాయంచ, హాసిన, విషిక నాకెంతో సపోర్ట్ చేశారు. మా కోసం వచ్చిన తేజు గారికి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా నాన్నకి థాంక్స్. మా నాన్న కష్టం చూస్తూ నేను పెరిగాను. నా కోసం మా అక్క ఎక్కువగా కష్టపడుతుంటారు. మే 22న థియేటర్లో కలుద్దాం. ‘పురుష:’ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. అసలే ఈ సమ్మర్‌లో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా చూసేలా మా సినిమా ఉంటుంది. అందరూ ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారు’ అని అన్నారు.

సప్తగిరి మాట్లాడుతూ .. ‘వీరు గారు కథ చెప్పినప్పుడు నా ఇన్ పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను. కానీ వీరు గారు మాత్రం తన దారిలోనే వెళ్లారు. అతను అనుకున్నట్టుగానే సినిమాని తీశారు. బత్తుల కోటేశ్వరరావు గారు మన సినిమా ఇండస్ట్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ మూవీని ఎంతో అద్భుతంగా నిర్మించారు. సతీష్ ముత్యాల గారు మాకు మంచి విజువల్స్ ఇచ్చారు. శ్రవణ్ గారి పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా అదిరిపోతుంది. విషిక, హాసిని, రాయంచ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటారు. మా హీరోయిన్లందరికీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కసిరెడ్డితో పని చేయడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో గానీ కోటేశ్వరరావు గారి లాంటి తండ్రి, సరస్వతి గారి లాంటి అక్క దొరికి ఉంటారు. మే 22న మా సినిమాని చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ.. ‘సరస్వతి బత్తుల గారి వల్లే ‘పురుష:’ ఇక్కడి వరకు వచ్చింది. ఈ జర్నీలోని ప్రతీ దశలో ఆమె మాకు సపోర్ట్‌గా నిలిచారు. కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక కోటేశ్వరరావు గారు ఓకే చెప్పారు. నిర్మాత గారు ఖర్చుకి ఎక్కడా వెనుకడుగు వేయలేదు. నాకు కోటేశ్వరరావు గారు, సరస్వతి గారిని పరిచయం చేసిన సతీష్ ముత్యాల గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇప్పించిన సతీష్ ముత్యాల గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. కథ చెప్పిన వెంటనే సప్తగిరి గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. మగజాతి ఆణిముత్యంలా అందరినీ నవ్విస్తారు. రాజ్ కుమార్ గారి కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆయన్నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఎక్కడా కూడా కొత్త హీరోలా అనిపించడు. హీరోయిన్లంతా అద్భుతంగా నటించారు. మే 22న మా సినిమా రాబోతోంది. అందరూ మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. అయితే నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మ తరువాత సినిమానే నాకు గురువు. సినిమా నాకెంతో నేర్పింది. అందుకే నా వంతుగా ఈ సినిమా పరిశ్రమకు వచ్చి మంచి చిత్రాన్ని తీశాను. నా కోరికను నెరవేర్చుతున్న నా కొడుకు పవన్ కళ్యాణ్‌కి థాంక్స్. ఉన్న సిగ్గు, బిడియాన్ని వదిలేసి నటించాడు. నా కొడుక్కి నేను, తల్లి, అక్క.. ఈ ముగ్గురే ప్రపంచం. నా కొడుక్కి ఈ సినిమా లోకాన్ని పరిచయం చేయాలని, అతనికి ఉన్న సిగ్గు, బిడియాన్ని పోగొట్టాలని హీరోగా చేశాను. నాకు ఈ ప్రయాణంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమా మే 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు