Homeతెలంగాణప్రాదేశిక పోరు...! తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు

ప్రాదేశిక పోరు…! తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాత్రం డిసెంబర్ తరువాతే అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి.. మున్సిపల్ ఎన్నికలను సైతం పూర్తి చేశారు. ఆ రెండు ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది. కానీ దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

గత ఏడాది నోటిఫికేషన్…

వాస్తవానికి గత ఏడాది ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పటికే పాలకవర్గాల గడువు ముగియడంతో సెప్టెంబరు 29న నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు కూడా మొదలయ్యాయి. అయితే బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు విచారణ కారణంగా రాష్ట్ర హైకోర్టు అక్టోబర్ 9న ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అటు తరువాత హైకోర్టు అనుమతితో గ్రామపంచాయతీలుకు, మున్సిపాలిటీలకు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. అయితే ఇప్పుడు రిజర్వేషన్ల విధానం కొలిక్కి రానుండడంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అనేక రకాల అవరోధాలు ఉన్నాయని.. అక్టోబర్ తర్వాత ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది.

ఓటర్ల జాబితాతో హడావిడి…

అయితే మొన్న ఆ మధ్యన ఓటర్ల జాబితా పై అధికారులు హడావిడి చేశారు. కానీ తరువాత అంతా సైలెంట్ అయింది. ఇప్పటికే పంచాయితీలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. చివరిగా మండల పరిషత్ లతోపాటు జిల్లా పరిషత్ లను సైతం కైవసం చేసుకుని సత్తా చాటాలని భావిస్తుంది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా 566 జడ్పిటిసి స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్ స్థానాలు ఉన్నాయి.

మేడ్చల్- మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో.. అది జిల్లా పరిషత్ ల జాబితా నుంచి తొలగించబడింది. 2019 తర్వాత అనేక గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. అందుకే గ్రామాల సంఖ్య తగ్గింది. గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా మొత్తం 44 ఎంపీటీసీలు, నాలుగు ఎంపీపీలతోపాటు నాలుగు జడ్పిటిసి స్థానాలు తగ్గాయి. అయితే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు