Homeతెలంగాణకేంద్ర మంత్రి పదవికి ఈటల రాజేందర్ పేరు...? రాష్ర్టంలో హాట్ టాపిక్‌...

కేంద్ర మంత్రి పదవికి ఈటల రాజేందర్ పేరు…? రాష్ర్టంలో హాట్ టాపిక్‌…

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఊహాగానాల మధ్య తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్లు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇదే సమయంలో రాష్ట్రాల వారీగా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికల వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు నాయకుల పేర్లు చర్చకు వస్తుండగా, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ, భారతీయ జనతా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో బీసీ సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పదవిపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. భగీరథ్ పోక్సో కేసు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ విమర్శలు, ప్రతిపక్ష పార్టీల నిరసనలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలతో బండి సంజయ్ పై ఒత్తిడి పెరిగినట్లు రాజకీయ వర్గాలు .అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు సంబంధించి మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు