HomeజాతీయంLeft Parties: వామపక్షాల పతనం.. దేశ వ్యాప్తంగా అధికారం కోల్పోయిన కమ్యూనిస్టులు!

Left Parties: వామపక్షాల పతనం.. దేశ వ్యాప్తంగా అధికారం కోల్పోయిన కమ్యూనిస్టులు!

End of an Era: దేశంలో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు పూర్తిగా బలహీనపడ్డాయి. ఒకప్పుడు పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్న వామపక్షాలు ప్రస్తుతం ఒక్క రాష్ట్రంలో కూడా పాలనలో లేవు. కేరళలో కూడా ఇటీవల లెఫ్ట్ కూటమి ఓటమి చెందడంతో ఆ పార్టీలకు అధికారం పూర్తిగా దూరమైనట్లు కనిపిస్తోంది. గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి వామపక్షాలకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.

తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా..

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వంటి పార్టీలతో కూడిన వామపక్ష కూటమి ఒకప్పుడు పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా నిలిచింది. 1951-52 తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. 1957లో కేరళలో E. M. S. నంబూదిరిపాడ్ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీల్లో చీలికలు వచ్చి సీపీఐ, సీపీఎంగా విడిపోయాయి. 1977లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం అధికారంలోకి వచ్చి దాదాపు 34 ఏళ్ల పాటు పాలించింది. ఆ సమయంలో జ్యోతి బసు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 1996లో ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, పార్టీ నిర్ణయం కారణంగా అది సాధ్యం కాలేదు.  2011 తర్వాత వామపక్షాల పతనం వేగంగా. పశ్చిమబెంగాల్‌లో భూసేకరణ. జరిగిన నిరసనలు వామపక్షాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ హామీని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. త్రిపురలో కూడా 2018లో బీజేపీ గెలిచి వామపక్షాలను అధికారానికి దూరం చేసింది.

కేరళలోనూ అధికారానికి దూరం

కేరళలో మాత్రం సాధారణం వరకు వామపక్షాలు తమ ప్రభావం నిలబెట్టుకున్నాయి. 2021లో పినరయి విజయరం మళ్లీ అధికారంలోకి వచ్చినా, తాజా ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభావం చాలా పరిమితంగా మారింది. 2024 లోక్‌ ఎన్నికల్లో కూడా కేవలం కొద్ది సీట్లకే పరిమితమయ్యాయి.  ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు బలహీనపడి, తమ ప్రాభవాన్ని కోల్పోయాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు