-
వందశాతం ఉత్తీర్ణత
హనుమకొండ, క్రైమ్ మిర్రర్: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 5731 ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించి కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సత్తా చాటారు. ఆరు పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు ఈ ఆరు పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్ కావడం అనేది గమనా ర్వం . దీన్నిబట్టి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగు అని 100% నిరూపించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ములుగు జిల్లా 99. 30% రాష్ట్రంలోనే టాప్ లో నిలువగా హైదరాబాద్ జిల్లా 89.23% అట్టడుగు స్థానంలో ఉన్నది. హనుమకొండ జిల్లా ప్రభుత్వ మర్కాజి హైస్కూల్లో 154 మంది పరీక్ష వ్రాయగా 151 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు.
హనుమకొండ జిల్లా మర్కాజి హై స్కూల్ జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి స్కూలు పేరును గత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసిపోయి బోధన క్రమశిక్షణ తో జిల్లాకే పేరు తెచ్చి పెట్టారు. ఈ ఫలితాలతోనైనా జిల్లా నడిబొడ్డున ఉన్నప్పటికీ అత్యధిక విద్యార్థులు ఈ స్కూల్లోనే ఉన్నప్పటికీ వసతులలేమి చాలా తీవ్రంగా ఉంటున్నది పలుమార్లు జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది జిల్లాకే టాపర్గా వచ్చిన ఈ స్కూలుకు ఈ 2026 ,27 సంవత్సరంలోనైనా సౌకర్యాలు కల్పించాలని రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుంటామని చెప్పారు.
మర్కాజి హై స్కూల్ టాపర్ గా కె సిరి చందన 579 మార్కులు సాధించగా పి శివాని 532 శ్రద్ధ 528 మార్కులు సాధించినారు. 14 మందికి 500 కు పైగా మార్పులు వచ్చాయి. విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి.వి.రామారావు అందరి సహకారంతో జిల్లాలోనే టాపర్గా రాగలిగామని రాబోయే రోజులలో కూడా అందరీ సహకారం తో ముందుకు పోతామని హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. వరంగల్ జిల్లా క్రిష్ణ కాలనీ హైస్కూల్లో 105 మంది పరీక్ష రాయగా 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు 500కు పైగా మార్కులు 25 మంది విద్యార్థులు సాధించినారు .589 మార్కులు సాధించి వరంగల్ జిల్లా టాపర్ గా నిలిచింది. 94.28 పర్సెంటేజ్ ఫలితాలు సాధించినారు. మట్టెవాడ హైస్కూల్లో 84. 6% ఉత్తీర్ణత సాధించారు.
26 మంది పరీక్షరాయగా 22 మంది ఉత్తీర్ణులైనారు . జి నాగ వైష్ణవి 517 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. సోమిడి ప్రభుత్వ పాఠశాలలో 19 మంది పరీక్ష వ్రాయగా 18 మంది ఉత్తీర్ణులైనారు. శాయంపేట ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో 46 మంది పరీక్ష వ్రాయగా 42 మంది ఉత్తీర్ణులైనారు. తెలుగు హిందీ సైన్స్ సోషల్ లో 100% మార్కులు సాధించారు. 544,507,505 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచారు. గిర్మాజిపేట హైస్కూల్లో 25 మంది విద్యార్థులలో 450 నుండి 500 మార్కులు రాగా, పదిమంది విద్యార్థులకు 400 నుండి 450 మార్కులు సాధించారు.
వడ్డేపల్లి హైస్కూల్లో 30 మంది పరీక్ష వ్రాయగా 29 మంది ఉత్తీర్ణులైనారు. స్కూల్ టాపర్ గా 575 ,559,535 మార్కులతో ముగ్గురు విద్యార్థులు సాధించారు. పెట్రోల్ పంప్ హైస్కూల్లో 27 మంది పరీక్ష వ్రాయగా 24 మంది ఉత్తీర్ణత సాధించారు .తెలుగు, హిందీలలో 100% మార్కులు రాగా మాథ్స్ ,సైన్స్ లో 96 శాతం,ఇంగ్లీషులో 92 శాతం, సోషల్ లో 100% మార్కులు 24 మంది విద్యార్థులు సాధించినారు.