ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఉత్తర్ ప్రదేశ్‌లో ని ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు హౌజింగ్ సోసైటీలోని ఓ ప్లాట్‌లో మంటలు చెలరేగి మరికొన్ని ప్లాట్లకు కూడ విస్తరించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇందిరాపురంలోని గౌరీ గ్రీన్ అవెన్యూ హౌజింగ్ సోసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో సుమారు 10-12 ఫ్లాట్లు కాలిపోయాయని స్థానికులు మీడియాతో అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిఉండొచ్చని భావిస్తున్నారు