Homeతెలంగాణక్యాబినెట్లోకి ఆ ముగ్గురు...!

క్యాబినెట్లోకి ఆ ముగ్గురు…!

  • ప్రొఫెసర్ కోదండరాంకు పక్కా

  • విద్యాశాఖ కట్టబెట్టే అవకాశం

  • ఈసారి రాములమ్మకు సైతం

  • తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు స్థానం

  • బీసీల కోటాలో డిప్యూటీ సీఎం హోదా..?!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పై కసరత్తు ప్రారంభం అయిందా? ఓ ముగ్గురిని క్యాబినెట్లో తీసుకుంటారా? ఓ ఇద్దరికీ ఉద్వాసన తప్పదా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ క్యాబినెట్లో సమూల మార్పులు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. పనిలో పనిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మే నాలుగున ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

కొత్తగా ముగ్గురికి..
ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కొత్తగా ముగ్గురిని క్యాబినెట్ లోకి తీసుకొని.. ఓ ఇద్దరిని బయటకు పంపుతారన్న ప్రచారం నడుస్తోంది. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వంతో పాటు పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టిన ఓ ఇద్దరు మంత్రులను తొలగించడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రధానంగా ఓ ముగ్గురు నేతలను క్యాబినెట్ లోకి తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రధానంగా ప్రొఫెసర్ కోదండరాం, విజయశాంతి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురికి మంత్రి పదవుల విషయంలో పార్టీ హై కమాండ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే క్యాబినెట్ నుంచి తొలగించే ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది హాట్ టాపిక్ అవుతోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.

కోదండరాంకు విద్యాశాఖ..
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు ప్రొఫెసర్ కోదండరాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు కోదండరాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని అప్పట్లోనే ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఆయన ఎమ్మెల్సీ పదవి విషయంలో సాంకేతిక పరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో మంత్రివర్గంలోకి తీసుకొని విద్యాశాఖను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రొఫెసర్ గా విశేషమైన అనుభవం ఆయనకు ఉంది. అందుకే ఆయన సేవలను విద్యాశాఖ బలోపేతానికి వాడుకుంటారని తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గులాబీ పార్టీకి సైతం షాక్ ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

రాములమ్మ సినీ గ్లామర్..
మరోవైపు ఎమ్మెల్సీ విజయశాంతికి సైతం మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. మంత్రి పదవి హామీ తోనే ఆమె బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కేసిఆర్ పై బలమైన వాయిస్ ప్రయోగం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యమ నేపథ్యంలో విజయశాంతికి తెలంగాణ సమాజంలో మంచి పేరు ఉంది. ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మంచి సంకేతాలు పంపాలని రేవంత్ భావిస్తున్నారట. ఆమెకు ఉన్న సినీ గ్లామర్ను వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలని చూస్తున్నారట.

పొన్నం ప్రభాకర్ కు అధ్యక్ష బాధ్యతలు..
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం మంత్రివర్గంలోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందటే ఆయన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీసీ వర్గానికి చెందిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎం హోదా కట్టబెడతారని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇప్పుడు బీసీ కోటాలో మహేష్ గౌడ్కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవి మరో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగిస్తారని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు