Homeక్రైమ్భార్య‌ను చంపిన భ‌ర్త‌...! త‌ను కూడ పొలంలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌...

భార్య‌ను చంపిన భ‌ర్త‌…! త‌ను కూడ పొలంలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌…

  • అనాథ‌లుగా మారిన ఇద్ద‌రు పిల్ల‌లు

  • క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న బంధువులు

సంగారెడ్డి, క్రైమ్ మిర్ర్: అనుమాన భూతం ఆ ఇంటి పెద్ద‌ల‌ను మింగేసింది. అనుమానంతో భార్య‌ను చంపిన ఓ భ‌ర్త తాను కూడ పొలం వ‌ద్ద ఉరివేసుకొని మృతి చెందిన ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేప‌ట‌లో చోటు చేసుకుంది. సిద్ధాపూర్‌కు చెందిన రాజు(43), రాణి(40) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా రాజు భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవారు.

శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో భార్యతో గొడవపడి రోకలిబండతో తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రాజు తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దర్యాప్తు కొనసాగుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు