క్రైమ్ మిర్రర్, సినిమా:- సినిమా ఇండస్ట్రీలో ఈరోజుల్లో వస్తున్నటువంటి సినిమాలు నెలరోజులు ఆడడమే కష్టంగా ఉన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించినటువంటి “మన శంకర వరప్రసాద్” సినిమా ఏకంగా వంద రోజులను పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుక విడుదలైన ఈ సినిమా ధియేటర్లలో నిన్నటితో వంద రోజులను పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరికెక్కినటువంటి ఈ సినిమాలో హీరోగా చిరంజీవి హీరోయిన్గా నయనతార నటించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు బీమ్స్ మ్యూజిక్ అందించగా సినిమాలోని ప్రతి సాంగ్ కూడా అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాగా ఈ సినిమా ఇప్పటివరకు వందరోజులను పూర్తి చేసుకోవడమే కాకుండా 350 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీంతో వందరోజుల థియేట్రికల్ రన్లో ఈ మూవీ కూడా భాగమయ్యింది.
సమర్ధులను ఎన్నుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది : సీఎం చంద్రబాబు
KCR Ashirvad Sabha: “నేను మళ్ళీ వస్తా.. వచ్చాక మొదటి సంతకం దానిపైనే చేస్తా”