-
మీడియాలో కథనాలుగా..
-
సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ క్యాబినెట్లో లీక్ వీరులు ఉన్నారా? క్యాబినెట్ నిర్ణయాలను ముందుగానే లీక్ చేస్తున్నారా? అయితే వారు ఎవరు? ఏపీ పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో చర్చించాల్సిన అజెండా ముందుగానే మీడియాకు లీక్ అయ్యింది. దీనిపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో ఇటువంటి లీకులతోనే ఎన్టీఆర్ మంత్రివర్గాన్ని రద్దు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. క్యాబినెట్ అంశాలను లీక్ చేయడం ఎంతటి నేరమో వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉందనగా ఉదయం నుంచే అజెండా అంశాలు మీడియాలో చర్చకు రావడం చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రత్యర్థులతో చేతులు కలిపారా? అనే విషయాలపై ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కూటమి ఏ ప్రయత్నాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ముఖ్యంగా రాజధానుల స్టాండ్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. మావిగన్ ప్రతిపాదనతో సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ నిర్ణయాన్ని సమర్థించు కుంటోంది. కానీ జరగాల్సిన నష్టం ఆ పార్టీకి ఎప్పుడో జరిగిపోయింది. అయినా సరే మావిగన్ పై దూకుడుగా ముందుకు సాగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కచ్చితంగా ఇది కూటమికి ప్లస్ గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందుకే విజయవాడ వేదికగా మావిగన్ కు అనుకూలంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
-
జగన్ సెల్ఫ్ గోల్..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అంతా సానుకూలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి వేదికగా చంద్రబాబు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీరియస్ గానే కసరత్తు చేశారు. వాటిపై ప్రాథమికంగా మంత్రులకు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే క్యాబినెట్ సమావేశాల విషయంలో చర్చించాల్సిన అంశాలు మీడియాలో కథనాలుగా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా సీఎం చంద్రబాబు ఆశ్చర్యపోయారు. అసలు క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు మీడియాలో ఎలా వచ్చాయి అనే విషయంపై ఆరా తీశారు. అయితే కొంతమంది మంత్రులే లీకులు ఇచ్చినట్లు తేలడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
-
మూడు పార్టీలు ఉమ్మడిగా..
ఏపీ క్యాబినెట్లో ప్రస్తుతం మూడు పార్టీల మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా బిజెపి నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 20 మంది మంత్రులు టిడిపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. కొంతమంది మంత్రులకు ఉద్వాసన ఉంటుందన్న టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయములోనే క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు బయటకు వెళ్లాయి. మీడియాకు ఎవరో ఒకరు సమాచారం అందించారు. దానిపై నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. కేవలం మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న మంత్రులే లీకులు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
